ప్రతీ మనిషి జీవితం ఒక పుస్తకం వంటిది.
ప్రతీ పేజీ జాగ్రత్తగా చదివితే .. కొందరు మంచినీ ,
మరికొందరు చెడునూ నేర్పుతారు ., కొందరు ఎలా బ్రతకాలో నేర్పితే ..
మరికొందరు ఎలా బ్రతకకూడదో నేర్పుతారు. మనం నవ్వినా...
ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. నవ్వించిన వాళ్ళు కొన్నాళ్ళే గుర్తుంటారు కానీ ఏడ్పించిన వాళ్ళు మాత్రం జీవితాంతం గుర్తుంటారు.
జీవితం .. కాలం... రెండూ గొప్ప గురువులు.
కాలాన్ని ఎలా ఉపయోగించాలో ... జీవితం చెబుతుంది , జీవితం ఎంత విలువైనదో కాలం చెబుతుంది.
జీవితంలో ఆరాటపడితే సరిపోదు , పోరాడితేనే విజయం లభిస్తుంది . ఎందుకంటే ఆరాటంలో ఆలోచన మాత్రమే ఉంటుంది కానీ పోరాటంలో ప్రయత్నం ఉంటుంది.
జీవితంలో ఎదురయ్యే ప్రతీ సంఘటన... మంచి , చెడు ... రెండింటినీ బోధిస్తుంది. ఎవరు ఏది స్వీకరిస్తారన్న దాన్ని పై వారి వారి విజ్ఞత ఆధారపడి ఉంటుంది పదవిని చూసి వచ్చే మర్యాద ఎక్కువరోజులు ఉండకపోవచ్చు కానీ పద్ధతిని చూసి వచ్చే మర్యాద ప్రాణం పోయేవరకు ఉంటుంది
మనం చేయవలసిందల్లా ఒక్కటే ... నచ్చని మనుషులు గురించి మాట్లాడకూడదు.., ఇష్టం లేని మనుషులు గురించి తలచుకోకూడదు..., మనల్ని చులకన చేసినవారిని పట్టించుకోకూడదు... అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం చేతిలోని ధనం , నోటిలోని మాట ... రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ.
నా స్వానుభవంతో చెప్పే మాటలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను మూడు రూపాయలకోసం బాధపడిన రోజులు చూసాను, మూడులక్షలు ఇవ్వగలిగిన స్థాయిని చూసాను... నా చుట్టూ అందరూ ఉన్న రోజులూ చూసాను , ఒంటరిగా ఏడ్చిన రోజులు చూసాను , మనిషిలో మానవత్వము చూసాను ... అందుకే నాకు డబ్బు శాశ్వతమనే భ్రమలేదు, డబ్బేఅన్నిటికీఅనే అహంలేదు మనిషిని మనిషిగా చూస్తాను... మనిషిగా విలువిస్తాను... కష్టంలో ఉంటే శత్రువుకు కూడా సాయం చేస్తాను ... ఎదుటి వారి మనోభావాలు నచ్చితే వారితో జీవితాంతం స్నేహం చేస్తూ కష్ట సుఖాలులో పాలు పంచుకుంటాను. అవసరమైతే సహాయం అడుగుతాను . అదీ బేధభావం లేనప్పుడు మాత్రమే . అన్ని పరిస్థితుల్లోనూ అంటే డబ్బున్నా ... లేకున్నా ఒకేలా ఉంటాను. అందరూ అలాగే ఉండాలన్న భావం నాది . ఎవరు ఏ ఆపదలో ఉన్నా... చేతనైన సహాయం చేయడానికి ముందుంటాను.
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే . అదే విధంగా అందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ నలుగురితో కలిసి ఆనంద జీవితాన్ని గడపాలని ఆశిస్తాను. సర్వే జనా సుఖినోభవంతు

No comments:
Post a Comment